Search This Blog

శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీ జనన తేది,జనన సమయం,జనన ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య,ఉద్యోగ,వివాహ,కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్న ప్రసన , నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9492246872, Mail address :parakrijaya@gmail.com

Monday, March 20, 2017

20. ది న ఫలితం


20-Mar-2017

మాసము:ఫాల్గుణమురాహుకాలము:7:51 am - 9:22 amపక్షము:కృష్ణపక్షంయమగండము:10:53 am - 12:23 pmతిథి:సప్తమి 8:19 amగుళిక:1:54 pm - 3:24 pmనక్షత్రము:జ్యేష్ఠ 9:09 amదుర్ముహూర్తము:12:47 pm - 1:36 pm, 3:12 pm - 4:01 pmయోగము:వ్యతిపాత 5:36 am+అభిజిత్:11:59 am - 12:47 pmకరణము:బవ 8:19 am, భాలవ 9:28 pmసూర్యోదయము:6:21 amఅమృతకాలము:4:43 am+ - 6:30 am+సూర్యాస్తమయము:6:26 pm

మేషం

ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులకు పదోన్నతితో కూడిన బదిలీలుంటాయి. శ్రీవారు, శ్రీమతిల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానియ వ్యాపారులకు అనుకూలమైన కాలం. మీ వాక్‌చాతుర్యానికి, తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.

వృషభం

ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు. మీ జీవిత భాగస్వామి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడటం వల్ల సమస్యలను ఎదుర్కుంటారు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు.

మిథునం

ఎల్.ఐ.సి, ఫిక్సెడ్ డిపాజిట్లకు సంబంధించిన సొమ్ము చేతికందుతుంది. కుటుంబ పరిస్థితులు క్రమేణా మెరుగుపడతాయి. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి ఆశాజనకం. విదేశీ యత్నాల్లో స్పల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది.

కర్కాటకం

కోర్టు వాదోపవాదాల్లో ఫ్లీడర్లకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తుల శ్రమకు, అధికారుల నుంచి ప్రసంశలు లభిస్తాయి. నియమాలకు కట్టుబడి ఉండుటవలన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది.

సింహం

ఆర్థిక లావాదేవీలు సమర్ధంగా నిర్వహిస్తారు. స్థిరచరాస్తుల క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం. స్త్రీలకు తల, కాళ్లు, చేతులు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. పత్రిక, ప్రైవేటు విద్యా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం పెరుగుతుంది. ఖర్చులు, చెల్లింపులలో ఏకాగ్రత వహించండి.

కన్య

కుటుంబంలో చిన్న చిన్న కలహాలేర్పడే ఆస్కారం ఉంద, మెలకువ వహించండి. దైవ దర్శనాల వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. సంఘంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. ఫ్లీడర్లకు, ఫ్లీడర్ గుమస్తాలకు అనుకూలమైన కాలం. విదేశాలు వెళ్లటానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం.

తుల

నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ ధ్యేయం నెరవేరుతుంది. మిత్రుల కారణంగా మీ పనులు వాయిదా వేసుకుంటారు. స్పెక్యులేషన్ రంగాల వారికి ఆశాజనకం. స్త్రీల ఏమరుపాటుతనం, నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం కలదు.

వృశ్చికం

వృత్తుల వారికి లభించిన అవకాశాలు ఏమాత్రం సంతృప్తినీయవు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. నూతన పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో ఏకీభావం కుదరదు. అందరికి సహాయం చేసి మాటపడవలసి వస్తుంది. మొండిబాకీలు వసూలు చేస్తారు.

ధనస్సు

కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. ఉపాధ్యాయులకు సంతృప్తి కానవస్తుంది. ఆర్థిక విషయాలలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కుంటారు. మిమ్మల్ని తక్కువ అంచనా వేసే వారు అధికమవుతున్నారు. ప్రభుత్వోద్యోగులకు కోరుకున్న చోటికి బదిలీలు రావచ్చు. ఆలయాలను సందర్శిస్తారు.

మకరం

స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. స్త్రీలకు పొట్ట, బి.పి., నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కుంటారు. ఊహించని సంఘటనలు వల్ల మనస్థాపం తప్పవు, వైద్యులకు శస్త్ర చికిత్స చేయునపుడు మెళుకువ, ఏకాగ్రత అవసరం.

కుంభం

బ్యాంకింగ్ వ్యవహారాలు, మధ్యవర్తిత్వాలకు సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత ముఖ్యం. డబ్బు పోయినా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఉమ్మడి వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది. మీ ఆంతరంగిక సమస్యలకు నెమ్మదిగా పరిష్కార మార్గం దొరుకుతుంది. ఖర్చులు అధికమవుతాయి.

మీనం

కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిదని గమనించండి. కందులు, ఎండుమిర్చి స్టాకిస్టులు, వ్యాపారస్తులు ఒక అడుగు ముందుకు వేస్తారు. స్త్రీలు గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత, మెళుకువ అవసరం. ఆధ్యాత్మిక విషయాలలో ఏకాగ్రత వహించలేరు.

No comments:

Post a Comment

parakrijaya@gmail.comRelated Posts Plugin for WordPress, Blogger...