Search This Blog

శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీ జనన తేది,జనన సమయం,జనన ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య,ఉద్యోగ,వివాహ,కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్న ప్రసన , నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9492246872, Mail address :parakrijaya@gmail.com

Tuesday, March 21, 2017

21. ది న ఫలితం


21-Mar-2017

మాసము:ఫాల్గుణమురాహుకాలము:3:24 pm - 4:55 pmపక్షము:కృష్ణపక్షంయమగండము:9:21 am - 10:52 amతిథి:అష్టమి 10:32 amగుళిక:12:23 pm - 1:54 pmనక్షత్రము:మూల 11:51 amదుర్ముహూర్తము:8:45 am - 9:33 am, 11:11 pm - 11:59 pmయోగము:వారియ 6:00 am+అభిజిత్:11:59 am - 12:47 pmకరణము:కౌలవ 10:32 am, తైతుల 11:29 pmసూర్యోదయము:6:20 amఅమృతకాలము:Nilసూర్యాస్తమయము:6:26 pm

మేషం

ప్రింటింగ్, స్టేషనరీ వారికి అధికమైన శ్రమ, పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. సొంతంగా వ్యాపారం లేక ఏదైనా సంస్థ నెలకొల్పాలనే ఆలోచన స్ఫురిస్తుంది. గృహంలో ఏదైనా వస్తువుపోవడానికి ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. స్థిరాస్తి అమ్మకానికై చేయు యత్నం విరమించుకోవటం మంచిది.

వృషభం

స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. సోదరీ, సోదరులతో సంబంధ, బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం. ఖర్చులు పెరిగిన ఇబ్బందులే మాత్రం ఉండవు.

మిథునం

హోటల్, తినుబండ వ్యాపరస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మీ ఆలోచనా దృష్టిని మరికాస్త పెంపొందించుకోండి. పనిచేసే చోట చిన్న తగాదా జరగవచ్చు. చదువుకు సంబంధించిన విషయాలు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేయవచ్చు. వ్యాపారాభివృద్ధి, విస్తరణల కోసం చేసే యత్నాలు క్రమంగా సత్ఫలితాలనిస్తాయి.

కర్కాటకం

ప్రైవేటు, పత్రిక సంస్థలలోని వారికి, రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి, పనిభారం సమస్యలు తప్పవు. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఖర్చులు మీ స్తోమతకు తగినట్లుగానే ఉంటాయి. ప్రియతములిచ్చే సలహా మీకెంతో సంతృప్తినిస్తుంది.

సింహం

ప్రత్తి, పొగాకు, చెరకు రైతులకు, స్టాకిస్టులకు అనుకూలమైన కాలం. ఒకానొక సమయంలో చేతిలో ధనం లేక బాగా అవస్థపడతారు. దూరదేశాలు వెళ్లటానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు బరువు, బాధ్యతలు అధికం. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. బంధువులను కలుసుకుంటారు.

కన్య

ఉమ్మడి ఆర్థిక లావాదేవీల్లో మాటపడాల్సి రావచ్చు. మీ ఆలస్యం, అశ్రద్ధ వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొనక తప్పదు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పని ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మీ మనోభావాలు బయటకు వ్యక్తం చేయటం వల్ల అశాంతికి లోనౌతారు. విద్యా, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

తుల

వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారలతో చికాకులు తప్పవు. మీ మేలు పొందినవారే మిమ్మల్ని వ్యతిరేకిస్తారు. భార్య, భర్తల మధ్య కలహాలు, పట్టింపులు అధికమవుతాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. విద్యార్ధులకు దూరప్రాంతాలలో ఉన్నత విద్యకై అవకాశాలు లభిస్తాయి.

వృశ్చికం

ఉద్యోగాభివృద్ధి కోసం చేసే యత్నం ఫలిస్తుంది. స్త్రీలకు విలాసాలు, అలంకారాలు పట్ల ఆసక్తి అధికమవుతుంది. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచడం క్షేమదాయకం. ఖర్చులు చెల్లింపులు అధికంగా ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడుతాయి. దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

ధనస్సు

అనుకోని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. నూతన పరిచయాలు మీ అభివృద్ధికి దోహదపడతాయి. సహచరుల సహకారం వల్ల రాజకీయాలలోని వారికి గుర్తింపు, రాణంపు లభిస్తుంది. నూతన వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు పనివారలతో ఒత్తిడులను, చికాకులను ఎదుర్కొంటారు.

మకరం

చేపట్టిన పనులలో చిన్న చిన్న పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు సంబంధించిన లేఖలు అందుతాయి. భాగస్వామిక చర్చలు ప్రశాంతంగా ముగుస్తాయి. ఇప్పటివరకు వాయిదా పడుతున్న వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.

కుంభం

ఆడిట్, అకౌంట్స్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. కొంతమంది ముఖ్యమైన విషయాలలో మిమ్మల్ని సంప్రదిస్తారు. రావలసిన బకాయిలు సకాలంలో అందినా ధనం ఏమాత్రం నిల్వ చేయలేకపోతారు. పాతమిత్రుల కలయిక మీకు ఎంత సంతృప్తినిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి.

మీనం

ఉన్నతాధికారులకు తనిఖీలు, పర్యవేక్షణలలో ఏకాగ్రత ముఖ్యం. సాహసించి మీరు తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలనిస్తుంది. బ్యాంకింగ్ రంగాల వారికి మెళుకువ అవసరం. కళత్ర మొండి వైఖరి మీకు చికాకును కలిగిస్తుంది. రాజకీయనాయకులకు పదవి సమస్యలు అధికమవుతాయి. మీ సంతానం చదువులో రాణిస్తారు.

No comments:

Post a Comment

parakrijaya@gmail.comRelated Posts Plugin for WordPress, Blogger...