Search This Blog

శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీ జనన తేది,జనన సమయం,జనన ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య,ఉద్యోగ,వివాహ,కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్న ప్రసన , నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9492246872, Mail address :parakrijaya@gmail.com

Friday, April 21, 2017

21. ది న ఫలితం


21-Apr-2017

మాసము:చైత్రమురాహుకాలము:10:40 am - 12:14 pmపక్షము:కృష్ణపక్షంయమగండము:3:23 pm - 4:58 pmతిథి:దశమి 4:55 am+గుళిక:7:31 am - 9:06 amనక్షత్రము:ధనిష్ఠ 2:36 am+దుర్ముహూర్తము:8:28 am - 9:18 am, 12:40 pm - 1:30 pmయోగము:శుభ 1:10 pmఅభిజిత్:11:50 am - 12:38 pmకరణము:వనిజ 5:01 pm, విష్టి/భద్ర 4:55 am+సూర్యోదయము:5:57 amఅమృతకాలము:3:52 pm - 5:31 pmసూర్యాస్తమయము:6:32 pm

మేషం

స్త్రీలకు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మందులు, విత్తనాలు, రసాయన వ్యాపారులకు పురోభివృద్ధి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. లౌక్యంగా వ్యవహరించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. తరచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.

వృషభం

వృత్తుల వారి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. స్థిరచరాస్తుల విక్రయించాలనే మీ ఆలోచనను విరమించుకోవడం మంచిది. మీ వ్యవహారాలను స్వయంగా సమీక్షించుకోవడం ఉత్తమం. ఆకస్మిక ఖర్చులు, రుణవాయిదా చెల్లింపుల వల్ల ఇబ్బందులెదుర్కుంటారు. బ్యాంకు వ్యవహారాల్లో జాగరూకతో మెలగండి.

మిథునం

విదేశాల్లోని ఆత్మీయులకు ప్రియమైన వస్తుసామగ్రిని అందజేస్తారు. ఉద్యోగస్తులకు తోటివారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు పై చదువుల విషయమై ఒక నిర్ణయానికి వస్తారు. టెక్నికల్, మెడికల్, వాణిజ్య రంగాల వారికి ఆశాజనకం. కోర్టు వాజ్యాల్లో అనుకూల ఫలితాలుంటాయి.

కర్కాటకం

కొన్ని సందర్భాల్లో అనాలోచితంగా వ్యవహరించి ఇబ్బందులకు గురవుతారు. సంఘంలో మంచిపేరు, ఖ్యాతి లభిస్తుంది. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ప్రముఖుల కలయిక కోసం పలుమార్లు తిరగాల్సి ఉంటుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి.

సింహం

ఆటోమొబైల్, రవాణా, మెకానిక్ రంగాల్లో వారికి అనుకూలమైన కాలం. మీ మిత్రుల కోసం, బంధువుల కోసం బరువు బాధ్యతలు స్వీకరిస్తారు. చేయదలుచుకున్న మంచి పని వాయిదా వేయకండి. స్త్రీలకు విలాసవస్తువులు, ఆడంబరాల పట్ల మక్కువ పెరుగుతుంది. ఆకస్మికంగా ఆలయాలను సందర్శిస్తారు.

కన్య

నిర్మాణ పథకాల్లో సంతృప్తి కానవస్తుంది. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిది కాదని గమనించండి. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగ, వివాహ యత్నాలు నెరవేరుతాయి. ఖర్చులు అధికమవుతాయి.

తుల

కాంట్రాక్టర్లకు నూతన టెండర్లలో పునరాలోచన అవసరం. సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. విద్యార్థులతో మానసిక ప్రశాంతత చోటు చేసుకుంటుంది. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. విదేశీ ప్రయాణాలు అనుకూలం.

వృశ్చికం

వ్యాపార, ఆర్థికాభివృద్ధికి చేసే కృషిలో ఆశాజనకమైన మార్పులు ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. కోరుకున్న సంబంధాలు నిశ్చయం కాగలవు. వాహన నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. ఇతరులకు ధన సహాయం చేసే విషయంలో మెళకువ అవసరం.

ధనస్సు

ఆత్మీయుల ద్వారా కీలకమైన విషయాలు గ్రహిస్తారు. ముఖ్యుల కోసం ధనం ఖర్చు చేస్తారు. స్త్రీలకు విలాసవస్తువులు, ఆడంబరాల పట్ల మక్కువ పెరుగుతుంది. ప్రేమికులకు ఎడబాటు, చికాకులు తప్పవు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లలో పునరాలోచన అవసరం. ఎదుటివారితో మితంగా సంభాషించండి.

మకరం

ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాల్లో మార్పులుండవు. చిన్నచిన్న ఆటంకాల వల్ల చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పత్రిక, ప్రైవేట్ సంస్థలలోని వారికి ఓర్పు, పనియందు ఏకాగ్రత అవసరం. వాయిదా పడిన మొక్కుబడులు తీర్చుకుంటారు. బంధువుల రాక వల్ల కొంత అసౌకర్యానికి లోనవుతారు.

కుంభం

భాగస్వామిక చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. ఉపాధ్యాయులకు నూతన వాతావరణం, పరిస్థితులు ఆందోళన కలిగిస్తాయి. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. పట్టుదలతో శ్రమించి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులెదుర్కుంటారు.

మీనం

ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొత్త యత్నాలు మొదలెడతారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పనివారితో చికాకులు వంటివి ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. నూతన దంపతులకు ఎడబాటు, చికాకులు తప్పవు.

No comments:

Post a Comment

parakrijaya@gmail.comRelated Posts Plugin for WordPress, Blogger...