Labels

2014-2015 rasi phalalu (16) 2015-2016 (12) 2017-2018 rasi phalalu (1) Advertisements (3) Anuradha (1) Ardra (1) Ashlesha (1) Ashwini. (1) astrology books (61) Astrology softwares (7) Bharani (1) Chitra (1) chitta (1) Dhanishta (1) gochara phalalu (13) Hasta (1) Jyeshtha (1) Krittika (1) Magha (1) makha (1) Mrigashirsha (1) Mula (1) P.V.Radhakrishna predictions. (4) pubba (1) Punarvasu (1) PurvaBhadrapada (1) PurvaPhalguni (1) Purvashadha (1) Pushyami (1) Revati (1) Rohini (1) Shatabhisham (1) Shravanam (1) Star (27) Swati (1) telugu astrology (43) telugu rasi phalalu (16) Uttara (1) UttaraBhadrapada (1) UttaraPhalguni (1) Uttarashadha (1) vastu (1) Vishakha (1) vivaha maitri (1) vivaha pontana (1) ఆంగ్ల నెల ఫలితములు (12) ఉగాది రాశిఫలాలు (1) కుజుడు (2) కేతువు (2) గురుడు (2) గ్రహముల ద్వాదశ భావాశ్రయ ఫలము (21) గ్రహములు (1) చంద్రుడు (2) జన్మ నక్షత్రాలు (4) జన్మలగ్నఫలములు (26) జయ నామ సంవత్సర రాశి ఫలితాలు (15) జ్యోతిష సంబంధ ముఖ్య విషయములు (1) తెలుగు సంవత్సర ఫలితం (15) తెలుసుకోవలసిన ముఖ్యవిషయాలు (7) నవగ్రహచార ఫలములు (11) నవగ్రహాలు (23) నోములు (1) న్యూమారాలజీ (1) పక్ష ఫలం (2) పంచాంగ విషయాలు (61) పూజలు (3) ప్రశ్న చక్రం (12) బుధుడు (2) మంత్రం (20) మన్మథ నామ సంవత్సర ఉగాది రాశిఫలాలు (9) మన్మథ నామ సంవత్సర ఉగాది కందాయ & నవ నాయక ఫలాలు (1) మన్మథ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం (2) మన్మథ నామ సంవత్సర ఉగాది రాశిఫలాలు (3) మా ప్రచురణలు (16) మాసఫలాలు (3) యంత్రములు / yantras (69) రత్నధారణ (13) రవి (2) రాహువు (2) రుద్రాక్షలు (8) వార ఫలం (1) వాస్తు (1) వాస్తు శాస్త్రము (19) వాస్తు సార సంగ్రహం (57) శని (2) శుక్రుడు (2) శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం (1) శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిషనిలయం (17) శ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం (1) సంఖ్యాక ఫలితము (11) సంఖ్యాశాస్త్రము (1)

శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీ జనన తేది,జనన సమయం,జనన ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య,ఉద్యోగ,వివాహ,కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్న ప్రసన , నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 7013390324, Mail us :parakrijaya@gmail.com

Tuesday, May 16, 2017

16. దినఫలితం


16-May-2017

మాసము:వైశాఖమురాహుకాలము:3:26 pm - 5:03 pmపక్షము:కృష్ణపక్షంయమగండము:8:58 am - 10:35 amతిథి:పంచమి 2:46 pmగుళిక:12:12 pm - 1:49 pmనక్షత్రము:ఉత్తరాషాడ [మంధాక్ష] Full Nightదుర్ముహూర్తము:8:19 am - 9:11 am, 11:05 pm - 11:50 pmయోగము:శుభ 9:10 pmఅభిజిత్:11:48 am - 12:36 pmకరణము:తైతుల 2:46 pm, గరజ 3:42 am+సూర్యోదయము:5:44 amఅమృతకాలము:12:22 am+ - 2:08 am+సూర్యాస్తమయము:6:40 pm

మేషం

ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానవస్తుంది. మీ ఆలోచనలు క్రియారూపంలో పెట్టి జయం పొందండి. వాణిజ్య ఒప్పందాలు వాయిదా వెయ్యడం మంచింది. గతానుభవాలు జ్ఞప్తికి రాగలవు. ట్రాన్స్ పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి ఒత్తిడి, చికాకులు పెరుగుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృషభం

సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సందర్భానుకూలంగా సంభాషించుటం వల్ల మీకు గుర్తింపు లభిస్తుంది. నూతన ఎగ్రిమెంట్లు వాయిదా వేయండి. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. విద్యార్థులు విద్యా విషయాల పట్ల ఏకాగ్రత వహించలేరు.

మిథునం

ఆర్థిక విషయాల్లో ఏకాగ్రత అవసరం. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఉపాధ్యాయులు ఒత్తిడి సమస్యలకు లోనవుతారు. స్త్రీలకు కాళ్లు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. ఫైనాన్స్, చిట్ ఫండ్ బ్యాంకింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు.

కర్కాటకం

ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా మిత్రుల సహకారం వల్ల సమసిపోతాయి. ప్రేమికుల మధ్య నూతన ఆలోచనలు స్ఫురించగలవు. వాగ్వివాదాలకు దిగి సమస్యలు తెచ్చుకోకండి.

సింహం

ఆర్థిక విషయాల్లో ఒడడుగు ముందుకేస్తారు. నగదు చెల్లింపు చెక్కుల జారి విషయంలో జాగ్రత్త వహించండి. రాజకీయాల్లో వారికి మతిమరుపు పెరగడం వల్ల ఆందోళనకు గురవుతారు. వాహనం అమర్చుకోవాలనే మీ ప్రయత్నం వాయిదా పడుతుంది. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు పురోభివృద్ధి.

కన్య

స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ప్రైవేటు సంస్థల్లో వారికి ఓర్పు, ఏకాగ్రత అవసరం. దూరప్రయాణాలలో వస్తువుల పట్ల మెళుకువ అవసరం. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది.

తుల

ఉద్యోగస్తుల తొందరపాటుతనానికి అధికారులతో మాట పడక తప్పదు. స్త్రీల మంచితనాన్ని ఉపయోగించుకుని అపనిందలు వేసేవారు అధికమవుతారు. ఏదైనా అమ్మే ఆలోచన వాయిదా వేయడం మంచిది. విదేశాలకు వెళ్లాలనే మీ కోరిక త్వరలోనే నెరవేరబోతోంది. ప్రముఖులతో చర్చలు జరుపుతారు.

వృశ్చికం

వస్త్ర, బంగారు, వెండి రంగాల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానరాగలదు. ఇతరుల కారణంగా మీరు మాట పడతారు. ఆలయాలను సందర్శిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలను గోప్యంగా ఉంచండి. ఏజెంట్లు, బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, సినిమా రంగాల్లోని వారికి సమస్యలు తలెత్తుతాయి.

ధనస్సు

నూనె, మిర్చి, కంది పప్పు వ్యాపారస్తులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి. ఆర్థిక విషయాల్లో ఊహించని మార్పు కానవస్తుంది. ఆహార వ్యవహారాల్లో మెళుకువ అవసరం. కొన్ని విషయాల్లో నిగూఢంగా ఉండండి. స్త్రీల పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు వాయిదా పడతాయి.

మకరం

ఉద్యోగస్తుల సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. హోటల్, తినిబండారాలు, బేకరీ పనివారలకు సామాన్యం. ఖర్చులు అంతగా లేకున్నా ఆర్థిక సంతృప్తి అంతగా ఉండదు. ప్రయాణాలలో అసౌకర్యానికి లోనవుతారు. అపరిచిత వ్యక్తులతో ఆచితూచి సంభాషించండి. దైవకార్యక్రమల పట్ల ఏకాగ్రత ఉండదు.

కుంభం

ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. బంధుమిత్రుల రాకపోకల వల్ల గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. తొందరపాటు నిర్ణయాల వల్ల అనర్థాలు తప్పవు. దైవ దర్శనాలు చేసుకుంటారు.

మీనం

వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు అధిక శ్రమ తప్పదు. కొంతమంది మీ నుండి విషయాలు రాబట్టడానికి ప్రయత్నిస్తారు. చిన్నతరహా పరిశ్రమలలో వారికి పురోభివృద్ధి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.

No comments:

Post a Comment

parakrijaya@gmail.com



Related Posts Plugin for WordPress, Blogger...