Search This Blog

శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీ జనన తేది,జనన సమయం,జనన ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య,ఉద్యోగ,వివాహ,కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్న ప్రసన , నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9492246872, Mail address :parakrijaya@gmail.com

Friday, May 19, 2017

19 దినఫలితం

19-May-2017

మాసము:వైశాఖమురాహుకాలము:10:35 am - 12:12 pmపక్షము:కృష్ణపక్షంయమగండము:3:26 pm - 5:04 pmతిథి:అష్టమి 6:11 pmగుళిక:7:21 am - 8:58 amనక్షత్రము:ధనిష్ఠ 10:48 amదుర్ముహూర్తము:8:19 am - 9:11 am, 12:38 pm - 1:30 pmయోగము:ఇంద్ర 8:38 pmఅభిజిత్:11:48 am - 12:36 pmకరణము:భాలవ 6:02 am, కౌలవ 6:11 pmసూర్యోదయము:5:43 amఅమృతకాలము:4:01 am+ - 5:39 am+సూర్యాస్తమయము:6:41 pm

మేషం

కాంట్రాక్టర్లకు చికాకులు తలెత్తుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉద్యోగాభివృద్ధికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. కూరగాయలు, పండ్లు, పూల వ్యాపారస్తులకు పురోభివృద్ధి. టీవీ, రేడియో రంగాలలోవారికి నిరుత్సాహం కానవస్తుంది. ప్రయాణాలు అనుకూలంగా సాగుతాయి.

వృషభం

రవాణా రంగాలవారికి చికాకులు అధికమవుతాయి. రాజకీయ నాయకులు ప్రముఖులను కలుసుకుంటారు. జాబ్ వర్క్ చేయువారు ఆందోళనకు గురవుతారు. లాయర్లకు లాభదాయకంగా ఉంటుంది. మీ ఆంతరంగిక సమస్యలకు నెమ్మదిగా పరిష్కార మార్గం కానరాగలదు. రుణాలకోసం అన్వేషిస్తారు.

మిథునం

ఊహించని ఖర్చులు అధికం అవడం వల్ల ఆందోళన చెందుతారు. మీ ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం. నూతన పెట్టుబడులు పెట్టునపుడు మెళకువ అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. క్రీడా రంగాలపట్ల ఆసక్తి కలుగుతుంది. సోదరీసోదురలు మధ్య ఏకీభావం కుదరదు.

కర్కాటకం

రావలసిన బకాయిలు సకాలంలో అందుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. విద్యా, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రింటింగ్, స్టేషనరీ, రంగాలలోని వారికి ఆశాజనకంగా ఉంటుంది.

సింహం

ఆర్థిక సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. కాంట్రాక్టర్లకు ఆందోళన పెరుగుతుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది.

కన్య

సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. మిత్రుల నుండి ఒక ముఖ్య సమాచారం అందుకుంటారు. నరాలు, కళ్లు, తలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. ట్రాన్స్ పోర్ట్, ఎక్స్ పోర్ట్ ట్రాన్స్ పోర్ట్, ఎక్స్ పోర్ట్ ట్రావెలింగ్ రంగాల వారికి ఆశాజనకం. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు.

తుల

విద్యార్థుల ఆలోచనలు పక్కదారి పట్టకుండా తగు జాగ్రత్తలో ఉండటం మంచిది. నిత్యావసర వస్తువులు, బియ్యం, ఉల్లి వ్యాపారులకు వేధింపులు, చికాకులు ఎదురవుతాయి. ఆర్థికంగా కలిసిరావడం వల్ల మరింత సంతోషంగా గడుపుతారు. ప్రతి విషయంలోను ఓర్పు, సంయమనంతో వ్యవహరించ వలసి ఉంటుంది.

వృశ్చికం

కోర్టు వ్యవహారాలు, ఆస్తి పంపకాలకు సంబంధించిన చర్చలు ఒక కొలిక్కి వస్తాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి రిప్రజెంటేటివ్‌లకు మార్పులు అనుకూలిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. బ్యాంకింగ్ రంగాలవారికి తమ పనుల్లో ఏకాగ్రత అవసరం.

ధనస్సు

భాగస్వామికులతో కీలకమైన విషయాలను చర్చిస్తారు. వాహనం నడుపునపుడు ఏకాగ్రత ముఖ్యమని గమనించండి. నిరుద్యోగులు ఇంటర్య్వూలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. స్త్రీలకు ఆత్మీయుల నుండి సహాయసహకారాలు, ప్రోత్సాహం లభిస్తాయి. ఖర్చులు అధికం.

మకరం

ప్లీడర్లకు, వైద్యులకు పురోభివృద్ధి. మీ సంతానం మొండి వైఖరి కారణంగా చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగస్తులుగా సమర్థంగా పనిచేసి పై అధికారులను మెప్పిస్తారు. దైవ, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది.

కుంభం

ఆర్థిక సంతృప్తి అంతగా ఉండదు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలించవు. వృత్తులు, ప్రింటింగ్ రంగాలవారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. విదేశీ ప్రయాణాలలో అడ్డంకులు తొలగిపోతాయి. విద్యార్థుల ఆలోచనలు పక్కదారి పట్టే ఆస్కారం ఉంది.

మీనం

భాగస్వామికుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. వస్త్ర, బంగారం, గృహోపరపణ వ్యాపారులకు ఆశాజనం. మీ ఆశయ సిద్ధికి నిరంతర కృషి, పట్టుదల ముఖ్యమని గమనించండి. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

No comments:

Post a Comment

parakrijaya@gmail.comRelated Posts Plugin for WordPress, Blogger...