Labels

2014-2015 rasi phalalu (16) 2015-2016 (12) 2017-2018 rasi phalalu (1) Advertisements (3) Anuradha (1) Ardra (1) Ashlesha (1) Ashwini. (1) astrology books (61) Astrology softwares (1) Bharani (1) Chitra (1) chitta (1) Dhanishta (1) gochara phalalu (13) Hasta (1) Jyeshtha (1) Krittika (1) Magha (1) makha (1) Mrigashirsha (1) Mula (1) P.V.Radhakrishna predictions. (4) pubba (1) Punarvasu (1) PurvaBhadrapada (1) PurvaPhalguni (1) Purvashadha (1) Pushyami (1) Revati (1) Rohini (1) Shatabhisham (1) Shravanam (1) Star (27) Swati (1) telugu astrology (43) telugu rasi phalalu (16) Uttara (1) UttaraBhadrapada (1) UttaraPhalguni (1) Uttarashadha (1) vastu (1) Vishakha (1) vivaha maitri (1) vivaha pontana (1) ఆంగ్ల నెల ఫలితములు (12) ఉగాది రాశిఫలాలు (1) కుజుడు (2) కేతువు (2) గురుడు (2) గ్రహముల ద్వాదశ భావాశ్రయ ఫలము (21) గ్రహములు (1) చంద్రుడు (2) జన్మ నక్షత్రాలు (4) జన్మలగ్నఫలములు (26) జయ నామ సంవత్సర రాశి ఫలితాలు (15) జ్యోతిష సంబంధ ముఖ్య విషయములు (1) తెలుగు సంవత్సర ఫలితం (15) తెలుసుకోవలసిన ముఖ్యవిషయాలు (7) నవగ్రహచార ఫలములు (11) నవగ్రహాలు (23) నోములు (1) న్యూమారాలజీ (1) పక్ష ఫలం (2) పంచాంగ విషయాలు (61) పూజలు (3) ప్రశ్న చక్రం (12) బుధుడు (2) మంత్రం (20) మన్మథ నామ సంవత్సర ఉగాది రాశిఫలాలు (9) మన్మథ నామ సంవత్సర ఉగాది కందాయ & నవ నాయక ఫలాలు (1) మన్మథ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం (2) మన్మథ నామ సంవత్సర ఉగాది రాశిఫలాలు (3) మా ప్రచురణలు (16) మాసఫలాలు (3) యంత్రములు / yantras (67) రత్నధారణ (13) రవి (2) రాహువు (2) రుద్రాక్షలు (8) వార ఫలం (1) వాస్తు (1) వాస్తు శాస్త్రము (19) వాస్తు సార సంగ్రహం (57) శని (2) శుక్రుడు (2) శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం (1) శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిషనిలయం (19) శ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం (1) సంఖ్యాక ఫలితము (11) సంఖ్యాశాస్త్రము (1)

శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీ జనన తేది,జనన సమయం,జనన ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య,ఉద్యోగ,వివాహ,కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్న ప్రసన , నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 7013390324, Mail us :parakrijaya@gmail.com

Tuesday, September 12, 2017

12 దినఫలం


12-Sep-2017

మాసము:భాద్రపదమురాహుకాలము:3:16 pm - 4:47 pmపక్షము:కృష్ణపక్షంయమగండము:9:08 am - 10:40 amతిథి:సప్తమి 1:01 am+గుళిక:12:12 pm - 1:44 pmనక్షత్రము:కృత్తిక 7:56 amదుర్ముహూర్తము:8:31 am - 9:20 am, 11:01 pm - 11:48 pmయోగము:హర్షణ 9:54 amఅభిజిత్:11:48 am - 12:36 pmకరణము:విష్టి/భద్ర 2:08 pm, బవ 1:01 am+సూర్యోదయము:6:04 amఅమృతకాలము:3:28 am+ - 4:58 am+సూర్యాస్తమయము:6:19 pm

మేషం

మేషం : ఈ రోజు నదీ స్నానాలు ఆచరించునపుడు జాగ్రత్త అవసరం. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు రావలసిన అలవెన్సులు, క్లయింలు మంజూరవుతాయి. కొంతమంది మీ నుంచి ధనం లేక ఇతరాత్రా సహాయం అర్థిస్తారు. స్త్రీల మాటకు కుటుంబంలో ఆమోదం గౌరవం లభిస్తాయి.

వృషభం

వృషభం : ఈ రోజు ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. లౌక్యంగా మెలిగి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. పాత మిత్రులతో కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి.

మిథునం

మిథునం : ఈ రోజు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దంపతుల మధ్య కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది. వైద్య రంగాల వారికి ఆపరేషన్‌ల సమయంలో ఏకాగ్రత, ఓర్పు ఎంతో ముఖ్యం. మీ అలవాట్లు బలహీనతలు ఇబ్బందులకు దారితీస్తాయి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు ఆర్థికంగా ఎదగటానికి చేయు యత్నాలు ఫలించవు. ఉద్యోగస్తులకు స్థానచలనంతో పాటు బరువు బాధ్యతలు అధికమవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. ప్రేమికుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి.

సింహం

సింహం : ఈ రోజు కుటుంబీకుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల వల్ల ఇబ్బందులకు గురయ్యే ఆస్కారం ఉంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. తరచూ సభలూ, సమావేశాల్లో పాల్గొంటారు.

కన్య

కన్య : ఈ రోజు స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు ఆరోగ్యంలో మెలకువ వహించండి. కళాకారులకు రచయితలకు, పత్రికా రంగంలో వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.

తుల

తుల : ఈ రోజు దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా సంతృప్తికరంగా పూర్తి కాగలవు. వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదుర్కోవలసి వస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ప్రైవేటు విద్యా సంస్థలలోని వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు.

వృశ్చికం

వృశ్చికం : ఈ రోజు విద్యార్థుల్లో మానసిక ప్రశాంతత చోటుచేసుకుంటుంది. స్త్రీలు, ద్విచక్ర వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఒప్పందాలు, చెక్కుల జారీ విషయంలో ఏకాగ్రత వహించండి. వాతావరణంలోని మార్పుల వల్ల మీ పనులు వాయిదాపడతాయి.

ధనస్సు

ధనస్సు : ఈ రోజు నిరుద్యోగుల నిర్లక్ష్యం వల్ల ఒక మంచి అవకాశం చేజారిపోయే ఆస్కారం ఉంది. స్త్రీలు షాపింగ్‌లో ఏకాగ్రత వహిస్తారు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. డాక్టర్లు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం.

మకరం

మకరం : ఈ రోజు ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్‌లో త్వరలోనే లభిస్తుంది. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.

కుంభం

కుంభం : ఈ రోజు మీరు ప్రారంభించిన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. స్త్రీలకు అర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సోదరీ, సోదరుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. రావలసిన ధనంలో కొంత మొత్తం చేతికందుతుంది.

మీనం

మీనం : ఈ రోజు ఉద్యోగస్తులు అధికారులకు మరింత చేరువవుతారు. మిమ్మలను తప్పుదారి పట్టించేందుకు కొంతమంది యత్నిస్తారు. ప్రముఖులను కలుసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. చేపట్టిన పనుల సకాలంలో పూర్తి కాగలవు. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది.

No comments:

Post a Comment

parakrijaya@gmail.com



Related Posts Plugin for WordPress, Blogger...