Labels

2014-2015 rasi phalalu (16) 2015-2016 (12) 2017-2018 rasi phalalu (1) Advertisements (3) Anuradha (1) Ardra (1) Ashlesha (1) Ashwini. (1) astrology books (61) Astrology softwares (1) Bharani (1) Chitra (1) chitta (1) Dhanishta (1) gochara phalalu (13) Hasta (1) Jyeshtha (1) Krittika (1) Magha (1) makha (1) Mrigashirsha (1) Mula (1) P.V.Radhakrishna predictions. (4) pubba (1) Punarvasu (1) PurvaBhadrapada (1) PurvaPhalguni (1) Purvashadha (1) Pushyami (1) Revati (1) Rohini (1) Shatabhisham (1) Shravanam (1) Star (27) Swati (1) telugu astrology (43) telugu rasi phalalu (16) Uttara (1) UttaraBhadrapada (1) UttaraPhalguni (1) Uttarashadha (1) vastu (1) Vishakha (1) vivaha maitri (1) vivaha pontana (1) ఆంగ్ల నెల ఫలితములు (12) ఉగాది రాశిఫలాలు (1) కుజుడు (2) కేతువు (2) గురుడు (2) గ్రహముల ద్వాదశ భావాశ్రయ ఫలము (21) గ్రహములు (1) చంద్రుడు (2) జన్మ నక్షత్రాలు (4) జన్మలగ్నఫలములు (26) జయ నామ సంవత్సర రాశి ఫలితాలు (15) జ్యోతిష సంబంధ ముఖ్య విషయములు (1) తెలుగు సంవత్సర ఫలితం (15) తెలుసుకోవలసిన ముఖ్యవిషయాలు (7) నవగ్రహచార ఫలములు (11) నవగ్రహాలు (23) నోములు (1) న్యూమారాలజీ (1) పక్ష ఫలం (2) పంచాంగ విషయాలు (61) పూజలు (3) ప్రశ్న చక్రం (12) బుధుడు (2) మంత్రం (20) మన్మథ నామ సంవత్సర ఉగాది రాశిఫలాలు (9) మన్మథ నామ సంవత్సర ఉగాది కందాయ & నవ నాయక ఫలాలు (1) మన్మథ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం (2) మన్మథ నామ సంవత్సర ఉగాది రాశిఫలాలు (3) మా ప్రచురణలు (16) మాసఫలాలు (3) యంత్రములు / yantras (67) రత్నధారణ (13) రవి (2) రాహువు (2) రుద్రాక్షలు (8) వార ఫలం (1) వాస్తు (1) వాస్తు శాస్త్రము (19) వాస్తు సార సంగ్రహం (57) శని (2) శుక్రుడు (2) శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం (1) శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిషనిలయం (19) శ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం (1) సంఖ్యాక ఫలితము (11) సంఖ్యాశాస్త్రము (1)

శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీ జనన తేది,జనన సమయం,జనన ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య,ఉద్యోగ,వివాహ,కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్న ప్రసన , నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 7013390324, Mail us :parakrijaya@gmail.com

Saturday, September 16, 2017

16 దినఫలం


16-Sep-2017

మాసము:భాద్రపదమురాహుకాలము:9:07 am - 10:39 amపక్షము:కృష్ణపక్షంయమగండము:1:42 pm - 3:13 pmతిథి:ఏకాదశి 4:30 pmగుళిక:6:05 am - 7:36 amనక్షత్రము:పుష్యమి 1:05 am+దుర్ముహూర్తము:6:05 am - 6:53 am, 6:53 am - 7:42 amయోగము:పరిఘ 7:43 pmఅభిజిత్:11:46 am - 12:34 pmకరణము:భాలవ 4:30 pm, కౌలవ 3:35 am+సూర్యోదయము:6:05 amఅమృతకాలము:7:00 pm - 8:31 pmసూర్యాస్తమయము:6:16 pm

మేషం

కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. రావలసిన పాత బాకీల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. దంపతుల మధ్య దాపరికం మంచిది కాదని గమనించండి. ఆర్ధిక సంతృప్తి ఆశించినంతగా ఉండదు. స్త్రీలు వస్త్రాలు, గృహోపకరణాలు సమకూర్చుకుంటారు.

వృషభం

ఆర్థిక వ్యవహారాలు, నూతన పెట్టుబడులకు సంబంధించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. సోదరీ, సోదరుల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. గత తప్పిదాలు పునరావృతమయ్యే సూచనలున్నాయి. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు.

మిథునం

కిరాణా, ఫ్యాన్సీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు సంతృప్రి కానరాదు. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు లేక అభివృద్ధి చేయాలనే దిశగా మీ ఆలోచనలుంటాయి. కాంట్రాక్టర్లకు పనివారితో సమస్యలు తప్పవు. ఆత్మీయుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. ఆలయాలను సందర్శిస్తారు.

కర్కాటకం

మత్స్య కోళ్ల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. దూరప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి. ఋణ ప్రయత్నం ఫలిస్తుంది. స్నేహ బృందాలు అధికం అవుతాయి. క్రీడా, కళా రంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. మీ యత్నాలకు ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు.

సింహం

సొంతంగా వ్యాపారం చేయాలన్న మీ సంకల్పం త్వరలోనే కార్యరూపం దాలుస్తుంది. స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం భంగపాటుకు గురవుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. బంధువుల రాకతో గృహంలో ఖర్చులు అధికమవుతాయి.

కన్య

దైవ, సేవకార్యక్రమాల్లో ఏకాగ్రత వహిస్తారు. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం. విద్యార్థులకు అతి ఉత్సాహం వల్ల సమస్యలు తలెత్తుతాయి. స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి వల్ల ఆందోళనలకు గురవుతారు. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులౌతారు.

తుల

కొబ్బరి, పండు, పూలు,పానియ, చిరు వ్యాపారులకు లాభం. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. మీ లక్ష్య సాధనలో ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. లాటరీ వ్యాపారస్తులకు సంతృప్తి కానవస్తుంది. కమ్యూనికేషన్, కంప్యూటర్, వైజ్ఞానిక రంగాలలో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి.

వృశ్చికం

ఆర్థిక పరిస్థితిల్లో ఆశాజనకమైన మార్పులు చోటుచేసుకుంటాయి. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమించవలసి ఉంటుంది. స్త్రీల పట్టుదల, మొండివైఖరి వల్ల గృహంలో ప్రశాంతత లోపిస్తుంది. సన్నిహితుల సూచనలు మీపై మంచి ప్రభావం చూపుతాయి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి.

ధనస్సు

హామీలు, మధ్య వర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ప్రేమికులకు మిత్రుల ద్వారా సహాయ సహకారాలు అందగలవు. రుణయత్నాలు, చేబదుళ్లు తప్పవు. నిరుద్యోగులకు వచ్చిన అవకాశం చేజారిపోయే అవకాశం ఉంది. ఖర్చులు పెరిగినా అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు.

మకరం

శాంతియుతంగా వ్యవహరిస్తే మీ సమస్యలు సానుకూలమవుతాయి. ఆస్తి వ్యవహారాల్లో సోదరుల తీరు మనస్తాపం కలిగిస్తుంది. ఖర్చులు పెరిగినా మీ ఆర్థిక పరిస్థితికి లోటుండదు. విదేశీయాన యత్నాల్లో సఫలీకృతులవుతారు. స్త్రీలలో ఉత్సాహం, పలు ఆలోచనలు చేటు చేసుకుంటాయి.

కుంభం

ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. మిమ్మల్ని చూసి ఈర్ష్యపడేవారు అధికమవుతున్నారని గమనించండి. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఖర్చులు అధికం.

మీనం

మిత్ర బృందాల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది.మెళకువ వహించండి. ప్రయాణాలు, వ్యూహాల అమలులో జాగ్రత్త అవసరం. దంపతుల మధ్య అరమరికలు లేకుండా మెలగవలసి ఉంటుంది. రాజకీయ నాయకులు సభా, సమవేశాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళుకువ అవసరం.

No comments:

Post a Comment

parakrijaya@gmail.comRelated Posts Plugin for WordPress, Blogger...