Labels

2014-2015 rasi phalalu (16) 2015-2016 (12) 2017-2018 rasi phalalu (1) Advertisements (3) Anuradha (1) Ardra (1) Ashlesha (1) Ashwini. (1) astrology books (61) Astrology softwares (1) Bharani (1) Chitra (1) chitta (1) Dhanishta (1) gochara phalalu (13) Hasta (1) Jyeshtha (1) Krittika (1) Magha (1) makha (1) Mrigashirsha (1) Mula (1) P.V.Radhakrishna predictions. (4) pubba (1) Punarvasu (1) PurvaBhadrapada (1) PurvaPhalguni (1) Purvashadha (1) Pushyami (1) Revati (1) Rohini (1) Shatabhisham (1) Shravanam (1) Star (27) Swati (1) telugu astrology (43) telugu rasi phalalu (16) Uttara (1) UttaraBhadrapada (1) UttaraPhalguni (1) Uttarashadha (1) vastu (1) Vishakha (1) vivaha maitri (1) vivaha pontana (1) ఆంగ్ల నెల ఫలితములు (12) ఉగాది రాశిఫలాలు (1) కుజుడు (2) కేతువు (2) గురుడు (2) గ్రహముల ద్వాదశ భావాశ్రయ ఫలము (21) గ్రహములు (1) చంద్రుడు (2) జన్మ నక్షత్రాలు (4) జన్మలగ్నఫలములు (26) జయ నామ సంవత్సర రాశి ఫలితాలు (15) జ్యోతిష సంబంధ ముఖ్య విషయములు (1) తెలుగు సంవత్సర ఫలితం (15) తెలుసుకోవలసిన ముఖ్యవిషయాలు (7) నవగ్రహచార ఫలములు (11) నవగ్రహాలు (23) నోములు (1) న్యూమారాలజీ (1) పక్ష ఫలం (2) పంచాంగ విషయాలు (61) పూజలు (3) ప్రశ్న చక్రం (12) బుధుడు (2) మంత్రం (20) మన్మథ నామ సంవత్సర ఉగాది రాశిఫలాలు (9) మన్మథ నామ సంవత్సర ఉగాది కందాయ & నవ నాయక ఫలాలు (1) మన్మథ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం (2) మన్మథ నామ సంవత్సర ఉగాది రాశిఫలాలు (3) మా ప్రచురణలు (16) మాసఫలాలు (3) యంత్రములు / yantras (67) రత్నధారణ (21) రవి (2) రాహువు (2) రుద్రాక్షలు (8) వార ఫలం (1) వాస్తు (1) వాస్తు శాస్త్రము (19) వాస్తు సార సంగ్రహం (57) శని (2) శుక్రుడు (2) శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం (1) శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం (9) శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిషనిలయం (19) శ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం (1) సంఖ్యాక ఫలితము (11) సంఖ్యాశాస్త్రము (1)

శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీ జనన తేది,జనన సమయం,జనన ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య,ఉద్యోగ,వివాహ,కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్న ప్రసన , నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 7013390324, Mail us :parakrijaya@gmail.com

Monday, November 20, 2017

20. దినఫలం


20-Nov-2017

మాసము:మార్గశిరమురాహుకాలము:7:48 am - 9:13 amపక్షము:శుక్లపక్షంయమగండము:10:37 am - 12:01 pmతిథి:విదియ 9:36 pmగుళిక:1:25 pm - 2:50 pmనక్షత్రము:జ్యేష్ఠ 12:47 am+దుర్ముహూర్తము:12:24 pm - 1:09 pm, 2:38 pm - 3:23 pmయోగము:సుకర్మ 10:31 pmఅభిజిత్:11:39 am - 12:24 pmకరణము:భాలవ 8:23 am, కౌలవ 9:36 pmసూర్యోదయము:6:24 amఅమృతకాలము:2:57 pm - 4:44 pmసూర్యాస్తమయము:5:38 pm

మేషం

మేషం: భవిష్యత్ అవసరాలకు పొదుపు అవసరం. మిమ్ములను చిన్నచూపు చూసిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. పరిచయం లేని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా వుండాలి. బ్యాంకు పనులు ఆలస్యం కావడంతో నిరుత్సాహం చెందుతారు. ఆలయాలను సందర్శిస్తారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు.

వృషభం

వృషభం: ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. విద్యార్థులకు, స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఇతరులపై ఆధారపడక, ప్రతి వ్యవహారం మీరే సమీక్షించుకోవడం అన్ని విధాల క్షేమదాయకం.

మిథునం

మిథునం: మీ జీవిత భాగస్వామి పట్ల సౌమ్యంగా వ్యవహరించండి. ఆకస్మిక ఖర్చులు ఎదురైనా సమయానికి ధనం సర్దుబాటు కాగలదు. మీ సంతానం విపరీత ధోరణి చికాకు పరుస్తుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. కుటుంబంలోని కొన్ని వ్యవహారాలు మీ ప్రమేయం లేకుండానే జరుగుతాయి.

కర్కాటకం

కర్కాటకం: సినిమా, విద్యా, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. కలప, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. అతిధ మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. స్త్రీలకు వస్త్ర, వస్తు ప్రాప్తి, వాహన యోగం వంటి శుభ ఫలితాలుంటాయి.

సింహం

సింహం: విద్యార్థులు క్రీడలు, క్విజ్ పోటీల్లో రాణిస్తారు. బంధుమిత్రులు ఒత్తిడి, మొహమ్మాటాలకు గురిచేస్తారు. వాహన చోదకులకు ఊహించని చికాకులు తలెత్తుతాయి. భాగస్వామిక చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. వైవాహిక జీవితంలో అనుకోని చికాకులు తలెత్తుటకు ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి.

కన్య

కన్య: ఇంట పెద్దమొత్తంలో ధనం, నగలు ఉంచుకోవడం క్షేమం కాదని గమనించండి. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రైవేట్ ఫైనాన్స్ దారుల ఒత్తిడి అధికమవుతుంది. మొండి ధైర్యంతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు సంబంధించిన లేఖలు అందుకుంటారు.

తుల

తుల: ఒకానొక సందర్భంలో కుటుంబీకుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. ఉపాధ్యాయులు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. హోటల్, క్యాటరింగ్ పనివారలకు కలిసివస్తుంది. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు అకాలభోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. 

వృశ్చికం

వృశ్చికం: స్త్రీలు ఉపవాసాలు, శ్రమాధిక్యత కారణంగా స్వల్ప అస్వస్థతకు గురవుతారు. శస్త్ర చికిత్స చేయునప్పుడు వైద్యులకు మెళకువ అవసరం. ఊహించిన దానికంటే అధిక రాబడి పెరుగును. ఊహించని వ్యక్తుల నుంచి అందిన సమాచారం మీకు బాగా ఉపకరిస్తుంది. కుటుంబీకుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడతాయి.

ధనస్సు

ధనస్సు: మార్కెటింగ్, ప్రైవేట్ సంస్థల్లో వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. మీ ఆవేశం, అవివేకం వల్ల వ్యవహారం చెడే ఆస్కారం వుంది. దైవదర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

మకరం

మకరం: వ్యాపారాల అభివృద్ధికి కొత్త పథకాలు అమలు చేస్తారు. ప్రయాణాల్లో తోటివారితో సమస్యలు తలెత్తకుండా వ్యవహరించండి. రాజకీయనాయకులు సభా సమావేశాల్లో పాల్గొంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు. దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి.

కుంభం

కుంభం: మీ వాక్చాతుర్యానికి, మంచితనానికి గుర్తింపు లభిస్తుంది. రావలసిన మొత్తం కొంత ముందు వెనుకలుగానైనా అందడం వల్ల ఇబ్బందులు అంతగా ఉండవు. స్త్రీలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఆత్మీయుల సాయంతో ఒక సమస్యను అధిగమిస్తారు. మధ్య మధ్య వైద్యుని సలహాలు వంటివి తప్పదు.

మీనం

మీనం: ముక్కుసూటిగా పోయే మీ తీరు ఇబ్బందులకు దారితీస్తుంది. ఎదుటివారికి ఉచిత సలహాలు ఇవ్వడం వల్ల ఇబ్బందులకు గురికావలసివస్తుంది. ప్రత్తి, పొగాకు, మిర్చి, నూనె వ్యాపారస్తులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తుల ఆలోచనలు పరి పరి విధాలుగా ఉండటం వల్ల మాటపడక తప్పదు.

No comments:

Post a Comment

parakrijaya@gmail.com



Related Posts Plugin for WordPress, Blogger...