Labels

2014-2015 rasi phalalu (16) 2015-2016 (12) 2017-2018 rasi phalalu (1) Advertisements (3) Anuradha (1) Ardra (1) Ashlesha (1) Ashwini. (1) astrology books (61) Astrology softwares (1) Bharani (1) Chitra (1) chitta (1) Dhanishta (1) gochara phalalu (13) Hasta (1) Jyeshtha (1) Krittika (1) Magha (1) makha (1) Mrigashirsha (1) Mula (1) P.V.Radhakrishna predictions. (4) pubba (1) Punarvasu (1) PurvaBhadrapada (1) PurvaPhalguni (1) Purvashadha (1) Pushyami (1) Revati (1) Rohini (1) Shatabhisham (1) Shravanam (1) Star (27) Swati (1) telugu astrology (43) telugu rasi phalalu (16) Uttara (1) UttaraBhadrapada (1) UttaraPhalguni (1) Uttarashadha (1) vastu (1) Vishakha (1) vivaha maitri (1) vivaha pontana (1) ఆంగ్ల నెల ఫలితములు (12) ఉగాది రాశిఫలాలు (1) కుజుడు (2) కేతువు (2) గురుడు (2) గ్రహముల ద్వాదశ భావాశ్రయ ఫలము (21) గ్రహములు (1) చంద్రుడు (2) జన్మ నక్షత్రాలు (4) జన్మలగ్నఫలములు (26) జయ నామ సంవత్సర రాశి ఫలితాలు (15) జ్యోతిష సంబంధ ముఖ్య విషయములు (1) తెలుగు సంవత్సర ఫలితం (15) తెలుసుకోవలసిన ముఖ్యవిషయాలు (7) నవగ్రహచార ఫలములు (11) నవగ్రహాలు (23) నోములు (1) న్యూమారాలజీ (1) పక్ష ఫలం (2) పంచాంగ విషయాలు (61) పూజలు (3) ప్రశ్న చక్రం (12) బుధుడు (2) మంత్రం (20) మన్మథ నామ సంవత్సర ఉగాది రాశిఫలాలు (9) మన్మథ నామ సంవత్సర ఉగాది కందాయ & నవ నాయక ఫలాలు (1) మన్మథ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం (2) మన్మథ నామ సంవత్సర ఉగాది రాశిఫలాలు (3) మా ప్రచురణలు (16) మాసఫలాలు (3) యంత్రములు / yantras (67) రత్నధారణ (21) రవి (2) రాహువు (2) రుద్రాక్షలు (8) వార ఫలం (1) వాస్తు (1) వాస్తు శాస్త్రము (19) వాస్తు సార సంగ్రహం (57) శని (2) శుక్రుడు (2) శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం (1) శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం (9) శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిషనిలయం (19) శ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం (1) సంఖ్యాక ఫలితము (11) సంఖ్యాశాస్త్రము (1)

శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీ జనన తేది,జనన సమయం,జనన ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య,ఉద్యోగ,వివాహ,కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్న ప్రసన , నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 7013390324, Mail us :parakrijaya@gmail.com

Friday, December 1, 2017

1దినఫలం


01-Dec-2017

మాసము:మార్గశిరమురాహుకాలము:10:41 am - 12:05 pmపక్షము:శుక్లపక్షంయమగండము:2:52 pm - 4:15 pmతిథి:ద్వాదశి 7:12 am, త్రయోదశి 4:20 am+గుళిక:7:54 am - 9:18 amనక్షత్రము:అశ్విని 2:28 pmదుర్ముహూర్తము:8:44 am - 9:29 am, 12:27 pm - 1:11 pmయోగము:వారియ 4:38 pmఅభిజిత్:11:42 am - 12:27 pmకరణము:భాలవ 7:12 am, కౌలవ 5:50 pm, తైతుల 4:20 am+సూర్యోదయము:6:31 amఅమృతకాలము:7:47 am - 9:16 amసూర్యాస్తమయము:5:39 pm

మేషం

మేషం : ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏమరుపాటుకూడదు. మీ రాక బంధువులకు ఉత్సాహం కలిగిస్తుంది. ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. విజ్ఞతగా వ్యవహరించి ఒక సమస్యను పరిష్కరిస్తారు. దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోర్టు వ్యాజ్యాలు, ఫిర్యాదులు ఉపసంహరించుకుంటారు.

వృషభం

వృషభం : హామీలు, చెక్కుల జారీలో పునరాలోచన మంచిది. కొన్ని వ్యవహారాలు సానుకూలతకు ధనం బాగా వ్యయం చేయవలసి ఉంటుంది. ఆత్మీయులకు కానుకలు సమర్పించుకుంటారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. భాగస్వామిక సమావేశాల్లో కొత్త విషయాలు చర్చకు వస్తాయి.

మిథునం

మిథునం : కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. స్త్రీలకు బంధువర్గాల నుంచి ఆహ్వానాలు లేక ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ఖర్చులు అధికంగా ఉన్నా సంతృప్తి, ప్రయోజనం పొందుతారు. ఏమాత్రం పొదువు సాధ్యంకాదు.

కర్కాటకం

కర్కాటకం : పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. రుణాల కోసం అన్వేషిస్తారు. ఉద్యోగస్తులకు తోటివారి కారణంగా అధికారులతో మాటపడవలసి వస్తుంది. స్త్రీలకు గృహాలంకరణ పట్ల ఆసక్తి కనపరుస్తారు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.

సింహం

సింహం : ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. వ్యవసాయ కూలీలకు, వృత్తుల వారికి ఆశించినంత ఆర్థిక సంతృప్తి ఉండదు. ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు ఒత్తిడి, చికాకులు వంటివి అధికమవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ప్రముఖుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి.

కన్య

కన్య : నూతన వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులు సమకూర్చుకుంటారు. దైవ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. పోస్టర్, ఎల్ఐసీ ఏజెంట్లకు, ఇళ్ళస్థలాల బ్రోకర్లకు పురోభివృద్ధి. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, చికాకులు తప్పవు. నిరుద్యోగులకు ప్రముఖులు సహకారంతో సదావకాశాలు లభిస్తాయి.

తుల

తుల : వస్త్ర, వెండి, బంగారం, లోహ పనివారలకు ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబీకులకు ఆరోగ్య విషయంలో మెళకువ అవసరం. బంధువులను కలుసుకుంటారు. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులకు శుభాకాంక్షలు, బహుమతులు అందించి, వారి ప్రాపకం సంపాదిస్తారు.

వృశ్చికం

వృశ్చికం : వృత్తి వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కోక తప్పదు. ప్రయాణాలలోనూ, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. సంక్షేమ కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి.

ధనస్సు

ధనస్సు : రుణ యత్నాల్లో ఆటంకాలు, ధనం సకాలంలో అందకపోవడం వల్ల మీ ఆర్థిక వ్యవహారాలు వాయిదాపడతాయి. ఉపాధ్యాయులకు, వృత్తుల్లో వారికి ఒత్తిడి, చికాకు తప్పదు. పెద్దల, అనుభవజ్ఞుల సలహాలు పాటించడం వల్ల ఒక సమస్య నుంచి క్షేమంగా బయటపడతారు. ఒక స్థిరాస్తిని అమర్చుకుంటారు.

మకరం

మకరం : ఉద్యోగస్తులు విధి నిర్వహణలో ఏకాగ్రతతో పని చేయవలసి ఉంటుంది. హామీల విషయంలో పునరాలోచన మంచిది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పులుపడటం వల్ల మాటపడక తప్పదు. మీ బలహీనతలను అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. క్రీడా రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది.

కుంభం

కుంభం : వృత్తిపరంగా ప్రముఖులను కలుసుకుంటారు. విద్యార్థులు విద్యా విషయాల పట్ల ఏకాగ్రత పెరుగుతుంది. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లకు చికాకులు, ఒత్తిడి తప్పవు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.

మీనం

మీనం : వ్యాపారాల్లో పెరిగిన పోటీని తట్టుకోవడానికి బాగా శ్రమించాలి. మీ అభిప్రాయాలు బయటకు వ్యక్తం చేయడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఇతరుల కారణాల వల్ల మీ కార్యక్రమాలు వాయిదాపడతాయి. నూతన పరిచయాలేర్పడతాయి. స్త్రీలకు తమ బంధువర్గాల నుంచి సంతోషకరమైన వార్తలు అందుతాయి.

No comments:

Post a Comment

parakrijaya@gmail.com



Related Posts Plugin for WordPress, Blogger...